పక్షపాత ధోరణి విడనాడి పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకరించండి.

ఎన్నికల సమయంలోనే పార్టీలకు రాజకీయాలు చేయడం ఉండాలని.. ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయాలు చేయడం ఎందుకని

Update: 2024-07-01 12:53 GMT

దిశ ఆర్మూర్ : ఎన్నికల సమయంలోనే పార్టీలకు రాజకీయాలు చేయడం ఉండాలని.. ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయాలు చేయడం ఎందుకని... పక్షపాత ధోరణి విడనాడి పార్టీలకు అతీతంగా అభివృద్ధికి పనులకు అధికార కాంగ్రెస్ పార్టీ సహకరించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. సోమవారం ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం ధర్మవరం గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు తో కలిసి 11 కోట్ల 71 లక్షల నిధులతో ఎత్తిపోతల ట్యాంక్ పనులకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు.పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలని, రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ ఎత్తిపోతల పనులకు నిధులు విడుదల చేయాలని, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి సమాన నిధులు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో పక్షపాత ధోరణి చూపకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయించాలన్నారు. పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు పనులను ప్రజలకు పది కాలాలపాటు నాణ్యతతో పనులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాక్లుర్ మండల అధ్యక్షుడు సురేష్ నాయక్,గంగొని సంతోష్, గంగారెడ్డి,రాజు, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News