వృద్ధుడి గొంతు కోసి హత్యాయత్నం చేసిన ముగ్గురు దుండగులు

దివ్యాంగురాలిపై అత్యాచారం కేసులో నిందితులైన ముగ్గురు వ్యక్తులు జైలు నుంచి బెయిల్ పై విడుదలై వచ్చి దివ్యాంగురాలు తండ్రిని గొంతు కోసి అత్యాయత్నానికి పాల్పడ్డారు.

Update: 2024-06-18 15:08 GMT

దిశ, నాగిరెడ్డిపేట్ : దివ్యాంగురాలిపై అత్యాచారం కేసులో నిందితులైన ముగ్గురు వ్యక్తులు జైలు నుంచి బెయిల్ పై విడుదలై వచ్చి దివ్యాంగురాలు తండ్రిని గొంతు కోసి అత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని రాఘవ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం రాఘవపల్లి గ్రామానికి చెందిన నార్ల నాగయ్య (55) అనే వ్యక్తికి ఓ దివ్యంగురాలైన కూతురు ఉంది. ఈ దివ్యంగురాలిపై గత రెండేళ్ల క్రితం రాఘవపల్లి గ్రామానికి చెందిన జూకంటి సాయిలు, జూకంటి రమేష్, పుట్ల శ్యామ్ అనే ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని నార్ల నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ కేసులో కేసులో ముగ్గురు వ్యక్తులు జైలుకు వెళ్లారు. కాగా జైలు నుంచి బెయిల్ పై విడుదలై వచ్చిన వ్యక్తులు ఫిర్యాదుదారుడైన నార్ల నాగయ్య సోమవారం రాత్రి గ్రామ శివారులో కాలకృత్యాలు తీర్చుకుని వస్తుండగా నాగయ్య పై కక్షగట్టి దాడి చేసి గొంతు కోసి, పలుచోట్ల తీవ్రంగా గాయపరిచి హత్యాయత్నానికి ప్రయత్నించారు. స్థానికులు గమనించి అడ్డుకోవడంతో నిందితులు తప్పించుకొని పారిపోయారు. అనంతరం నార్ల నాగయ్య ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు నార్ల నాగయ్య బావమరిది నార్ల సంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు.

Similar News