సీఎం రేవంత్ రెడ్డికి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి డెడ్ లైన్..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బుధవారం ఒక బహిరంగ లేఖ రాశారు.

Update: 2024-06-26 16:13 GMT

దిశ, ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బుధవారం ఒక బహిరంగ లేఖ రాశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆయనను కలిసిన సమయంలో ఆర్మూర్లో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ ను నిర్మించడానికి ఒప్పుకున్నారని మళ్లీ మాట మార్చడం ఏంటని సీఎం రేవంత్ రెడ్డికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ విషయంలో డెడ్ లైన్ విధించారు. వారం రోజుల్లో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే దీక్షకు సిద్ధమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బహిరంగ లేఖలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు వారి వారి సొంత నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ లను పైలెట్ ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించనన్నట్లు ప్రభుత్వం తెల్పడం పై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉత్తర తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, సీఎం రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఆర్మూర్ లో పైలెట్ ప్రాజెక్ట్ కింద నిర్మించనున్నట్లు, వారం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తెలుపని పక్షంలో ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో దీక్ష చేయడానికి అనుమతి ఇవ్వాలని డీజీపీని కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అభివృద్ధి కోసం అవసరం అయితే ఎక్కడి వరకు అయిన పోరాటానికి సిద్దం అని లేఖలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాల సెంటిమెంటును అభివృద్ధి విషయంలో రైజ్ చేయడంతో ఈ టాపిక్ లో రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ ల విషయంలో పునర్ ఆలోచనలు చేసే అవకాశం ఉందని ఆర్మూర్ ప్రాంతంలో రాజకీయ ప్రముఖులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఆర్మూర్ ఎమ్మెల్యే ఆర్మూర్ అభివృద్ధి విషయంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ సెంటిమెంట్ ఇష్యు పై రాసిన బహిరంగ లేక విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకోనుందని నిజామాబాద్ జిల్లా వాసులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

Similar News