ఆలూర్ మండల కేంద్రంలో మహాజన సర్వసభ్య సమావేశం....

ఆలూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం రోజున ప్రభుత్వం ఆదేశాల మేరకు మహాజన సర్వసభ్య సమావేశమును ఆలూర్ సొసైటీ చైర్మన్ తాంబూర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

Update: 2024-06-29 11:44 GMT

దిశ, ఆలూర్ : ఆలూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం రోజున ప్రభుత్వం ఆదేశాల మేరకు మహాజన సర్వసభ్య సమావేశమును ఆలూర్ సొసైటీ చైర్మన్ తాంబూర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు అమలు కొరకు రైతుల అభిప్రాయాల సేకరణ జరిగిందని అన్నారు. ఆలూర్, దేగాం, గగ్గుపల్లి, మాచర్లలోని రైతుల అభిప్రాయం సేకరించమని, రైతుబంధును 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతులు బంధు అమలు చేయాలని అన్నారు.

సాగు భూమి రైతులకు అమలు చేయాలని, రైతులు సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమములో ఆలూర్ సొసైటీ చైర్మన్ తాంబూర్ శ్రీనివాస్, సొసైటీ వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్, DCAO పాపయ్య, క్లస్టర్ ఆఫీసర్ సత్యనారాయణరావు, శంకర్ గౌడ్, రవీందర్, Ao హరికృష్ణ, A. E. O వసుధము,సొసైటీ డైరెక్టర్స్ కళ్లెం సాయి రెడ్డి, ప్రమోద్, రాజేశ్వర్, కళ్లెం బోజరెడ్డి, బార్ల సంతోష్ రెడ్డి, సింగేడి మల్లుబాయ్, వెల్మనర్సారెడ్డి, కట్ట నరసయ్య, ఆర్ముర్ వైస్ ఎంపీపీ మోతే చిన్న రెడ్డి, ఆలూరు మాజీ సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి, సొసైటీ కార్యదర్శి తొర్తి మల్లేష్, సొసైటీ సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Similar News