విద్యారంగాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.

Update: 2024-06-26 12:50 GMT

దిశ, నిజాంసాగర్ : విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. బుధవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలను పంపిణీ చేశారు. విద్యార్థినులు ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రిన్సిపాల్ సరోజన ఎమ్మెల్యేకు శాలువా కప్పి సన్మానించి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు తీసుకుంటుందని అన్నారు.

విద్యార్థులను సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టే బాధ్యత ఉపాధ్యాయులది అని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని సమాజంలో ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చికోతి జయ ప్రదీప్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, వకీల్ రాంరెడ్డి, జిల్లా ఎస్టీ ఉపాధ్యక్షుడు లోక్యా నాయక్, గాండ్ల రమేష్, గజ్జల రాములు, వెంకట్ రెడ్డి, అనీస్ పటేల్, పండరి, రాము రాథోడ్, లాల్ సింగ్, మండల విద్యాశాఖ అధికారి దేవిసింగ్, తహశీల్దార్ బిక్షపతి, ఎంపీఓ యాదగిరి, ప్రిన్సిపాల్ సరోజన, ఉపాధ్యాయురాలు రామ, సరిత, సుమ, రజిత, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

Similar News