కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా నిజామాబాద్ జీజీహెచ్ లో వైద్య సేవలు…

కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా నిజామాబాద్ జీజీహెచ్ లో వివిధ రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సూపరిండెంట్ డాక్టర్ ప్రతీమ రాజ్ పేర్కొన్నారు.

Update: 2024-06-18 10:53 GMT

దిశ, నిజామాబాద్ సిటీ: కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా నిజామాబాద్ జీజీహెచ్ లో వివిధ రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సూపరిండెంట్ డాక్టర్ ప్రతీమ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం జీజీహెచ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సూపరిండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ మాట్లాడుతూ.. ఈ ఆస్పత్రిలో ఇటీవల న్యూరో సర్జరీ సేవలు ప్రారంభించామని, ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ సేవలలో భాగంగా యూరోలజీ సేవలను అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిపిన నియామకాల్లో జీజీహెచ్ కి యూరోలజీ విభాగానికి చెందిన డా. శబరి నాథ్ రావడం ఇలాంటి శస్త్రచికిత్స లను విజయవంతం చేయడం చాలా సంతోషకరం అని తెలిపారు. జీజీహెచ్ లో ఈ వారంలో షైక్ జాని, రవి అనే ఇద్దరికీ మూత్రాశయం లో ఉన్న రాళ్ల ను శస్త్ర చికిత్స ద్వారా తొలగించడం జరిగిందన్నారు.

ఈ శస్త్ర చికిత్సలను, డా. శబరి నాథ్ యూరోలజీ శస్త్ర చికిత్స నిపుణుల ఆధ్వర్యంలో జరిపించడం జరిగిందని తెలిపారు. అంతే కాకుండా మూత్రపిండాలకు మిగతా చికిత్సలను కూడా అన్ని సమకూర్చుకొని త్వరలో చేస్తామని తెలిపారు. నిజామాబాద్ వాస్తవ్యులు ఎవరైనా మూత్రాశయం లో రాళ్ల తో ఇబ్బంది పడుతున్నట్లయితే జీజీహెచ్ లో సంప్రదిచగలరని సూచించారు. ఈ శస్త్ర చికిత్స చేయించుకున్న ఇద్దరు పేషెంట్లు ఆస్పత్రికి వచ్చి ఇక్కడ సేవలు బాగున్నాయని, ఈ శస్త్ర చికిత్సలకు ప్రైవేటు ఆసుపత్రి లో సుమారు 1 లక్ష రూపాయల ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని తమకు ఇక్కడ ఉచితంగా నిర్వహించిన సూపరింటెండెంట్ కి ఇతర వైద్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

Similar News