పారిశ్రామిక వేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది
తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని, అందుకు వారికి అవసరమైన వసతులు కల్పించడంతో పాటు మెరుగైన విద్యుత్ సరఫరా చేసి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామని రాష్ట్ర నీటిపారుదల ,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
దిశ, సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని, అందుకు వారికి అవసరమైన వసతులు కల్పించడంతో పాటు మెరుగైన విద్యుత్ సరఫరా చేసి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామని రాష్ట్ర నీటిపారుదల ,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట మండలంలోని గాంధీనగర్‌లో యువ పారిశ్రామిక వేత్త కంకణాల వెంకట పద్మజ హర్ష నెలకొల్పిన కెవిఆర్ స్టీల్ ఇండస్ట్రీని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డితో కలిసి మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో పరిశ్రమల స్థాపనకు యువ పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని సూచించారు.
పరిశ్రమల స్థాపన ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. అనంతరం కేవీ రామారావు సంస్మరణార్ధం ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, కెవిఆర్ స్టీల్ ఇండస్ట్రీ ఎండి కంకణాల శ్రీహర్ష, ప్రముఖ రియాల్టర్ చలసాని శ్రీనివాసరావు, గోదాల రంగారెడ్డి, బండి రవితేజ, వాసు, ఊటుకూరి భరత్, పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.