భార్యతో వెళ్లి వస్తానన్న వ్యక్తి అదృశ్యం
ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన నిడమనూరు మండల పరిధిలోని చోటు చేసుకుంది.
దిశ ,నిడమనూరు : ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన నిడమనూరు మండల పరిధిలోని చోటు చేసుకుంది. ఎస్ ఐ గోపాల్ రావు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని నారమ్మ గూడెం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి కోటయ్య (42) మిర్యాలగూడలో సామిల్ లీజుకు తీసుకొని నడిపిస్తున్నాడు. తేదీ 23.11.2024 ఉదయం 7 గంటలకు ఇంటి దగ్గర చెప్పి.. సామిల్ దగ్గరకు వెళ్ళాడు. తన భార్య నిర్మల మధ్యాహ్నం మిల్లు దగ్గరికి వెళ్లి చూసేసరికి మిల్లులో కనిపించలేదు. చుట్టుపక్కల తెలిసిన వారిని అడిగిన ఆచూకీ లభించలేదు. దీంతో బొడ్డుపల్లి కోటయ్య భార్య నిర్మల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ ఐ తెలిపారు.