యాదవులు చదువుతోపాటు రాజకీయంగా ఎదగాలి
యాదవులు చదువుతోపాటు రాజకీయంగా ఎదగాలని ప్రభుత్వ విఫ్ బీర్ల ఐలయ్య అన్నారు.
దిశ,రామన్నపేట: యాదవులు చదువుతోపాటు రాజకీయంగా ఎదగాలని ప్రభుత్వ విఫ్ బీర్ల ఐలయ్య అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం రాత్రి నిర్వహించిన యాదవుల సదర్ సమ్మేళన ఉత్సవం అట్టహాసంగా సాగింది. ప్రత్యేకంగా మూడు యువరాజు దున్నపోతులను అలంకరించి పూజలు చేసిన..అనంతరం పురవీధుల గుండా వాయిద్యాల మధ్య ఊరేగింపుగా కళాశాల మైదానానికి తీసుకువచ్చారు. దున్నపోతుల ప్రదర్శన, పోతరాజులు విన్యాలతో ఊరేగింపు ఆహ్లాదకరంగా సాగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పరంగా యాదవుల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. యాదవుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1.50కోట్లు కేటాయించారని అన్నారు. పశు సంపద పెరగడానికి యాదవుల కృషీ ఎంతో ఉందని తెలిపారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ..పశువులను, పాడి పంటలను పూజించే సంస్కృతి యాదవులు నమ్మకానికి ప్రతీకలని కొనియడారు. మండల కేంద్రంలో యాదవుల సంఘానికి 10లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, కాసం వెంకటేశ్వర్లు, క్యామ మల్లేష్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, ముక్కంల దుర్గయ్య యాదవ్, అఖిలభారత యాదవ మాసభ మండల అధ్యక్షుడు తిరుగుడు మల్లికార్జున్, కడారి స్వామి యాదవ్,నీల ఐలయ్య, మాజీ ఎంపీపీ కన్నెబోయిన జ్యోతిబలరాం, దూదిమెట్ల సత్తయ్య, సోమనబోయిన సుధాకర్ యాదవ్, జంగిలి నర్సింహ్మ, లోడంగి గోవర్దన్, తదితరులు పాల్గొన్నారు.