ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
గ్రామీణ ప్రాంతాల పేదలకు వైద్యం అందించడంలో లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు అనిర్వచనీయమైనదని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.
దిశ, డిండి : గ్రామీణ ప్రాంతాల పేదలకు వైద్యం అందించడంలో లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు అనిర్వచనీయమైనదని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం రఘురామ జనరల్ క్లినిక్ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని దేవరకొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులు వస్కుల సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నేటి సమాజానికి లయన్స్ క్లబ్ లాంటి సంస్థలు ఎంతో అవసరమని తెలిపారు. ఉచిత మెగా వైద్య శిబిరంలో 250 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మంగళవారం 25 మందికి కంటి ఆపరేషన్ పుష్పగిరి కంటి ఆసుపత్రి, సికింద్రాబాద్ సహకారంతో చేయిస్తున్నామని డాక్టర్ రఘురామ్ తెలిపారు. యశోద హాస్పిటల్ మలక్ పేట వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులను తూము వసుమతి సహకారంతో అందజేశారు. వైద్య శిబిరంలో శ్రీ వెంకటేశ్వర ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థినిలు సేవలను అందించారు. నిర్వాహకులు ఉచితంగా సేవలు అందించిన వైద్య బృందానికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వర్ రావు, డాక్టర్ సుధీర్ చక్రవర్తి, క్యాంప్ చైర్మన్ తిప్పర్తి రుక్మారెడ్డి, గాజుల రాజేష్, వనం శ్రీనివాస్, రామ్ చౌహన్, హరి, శ్రీధర్, రాము నాయక్, శ్రావణ్ కుమార్, రవి,బద్యా, లక్ష్మణ్, గడ్డమీది సాయికుమార్,బొల్లె సైలెస్, పొలం లక్ష్మణ్,మేకల కాశన్న, సర్వన్,ఉమర్,కలీం, అయ్యూబ్, తదితరులు పాల్గొన్నారు.