ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం

గత డిసెంబర్ 7న నాటికి నిరంకుశ పాలన కూల దోస్తు ప్రజాపాలన కోరుకుంటూ ప్రజలు మంచి చరిత్ర నిర్ణయాన్ని తీసుకుని ప్రజా పాలన అందించే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు .

Update: 2024-11-24 15:55 GMT

దిశ ,హుజూర్ నగర్ : గత డిసెంబర్ 7న నాటికి నిరంకుశ పాలన కూల దోస్తు ప్రజాపాలన కోరుకుంటూ ప్రజలు మంచి చరిత్ర నిర్ణయాన్ని తీసుకుని ప్రజా పాలన అందించే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అప్పటినుండి విద్యా సంక్షేమ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నామని, తమ ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజల ఆదరణ చూసి ప్రతిపక్షం ఓర్వలేక పసలేని ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. ఆదివారం ప్రజా పాలన ప్రజా విజయోత్సవను హుజూర్ నగర్ పట్టణంలోని కౌండిన్య ఫంక్షన్ హాల్ లో సూర్యాపేట జిల్లా లోని కోదాడ తుంగతుర్తి ఎమ్మెల్యేలు ఎన్ ఉత్తం పద్మావతి రెడ్డి ,మందేల సామ్యూల్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి సభలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అంతా కలిసి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు అని అన్నారు. ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో రెండు లక్షలు ఉద్యోగాలు కూడా వెయ్యలేదని కానీ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 50 వేల ఉద్యోగాలను నోటిఫికేషన్ వేసి నియమించామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రెండు లక్షల రుణమాఫీని 21 లక్షల రైతులకు 18 వేల కోట్ల రూపాయలను చేశామని, కొంతమంది రైతులకు మిగిలి ఉందని వారి కూడా జనవరి నాటికి రుణమాఫీ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థను సర్వనాశనం చేసిందని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా ఇండ్లు లేని నిరుపేదలందిరికి రూ. 5లక్షల రూపాయలు అందించి ఇంటి నిర్మాణం చేపట్టనున్నామన్నారు. నీటి పారుదల శాఖ ద్వారా కాలేశ్వర ప్రాజెక్ట్ మరమత్తులు చేపట్టడంతో పాటు..తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగుకు నీరందించే లక్ష్యంతో నీటి పారుదల శాఖ పని చేస్తుందన్నారు. నూతన ప్రాజెక్ట్ లు, లిప్ట్ ల నిర్మాణంతో పాటు పాత వాటికి మరమత్తలు చేసి రైతులకు సాగునీరు అందిస్తున్నామన్నారు. అతి త్వరలోనే అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని, కొత్త రేషన్ కార్డు ఇచ్చిన వెంటనే అందరికీ ఆరు కేజీల సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 158మెట్రిక్ టన్నుల వరిపంట సాగు అయి దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. ఈ ఖరీఫ్ సీజన్ నుండి సన్నరకం వరిపంటకు రూ. 500లు బోనస్ రైతులకు అందిస్తున్నామని తెలిపారు. రైతులు పండిచిన ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో రూ. 300కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఎస్సీ వారికి వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టుకు అనుగుణంగా ముందుకు పోతామని, అలాగే ఎస్సీ ఉద్యోగులను కూడా అదే విధంగా ఉద్యోగాలను నింపబోతామని స్పష్టం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం ఇంత మంచిగా పని చేయలేదన్నారు. మూసీ ప్రక్షాళన జరిగితే ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు సాగుకు ఆయకట్టు పెరుగుతుందన్నారు.హుజూర్ నగర్ -కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించామని రైల్వేలైన్ హైదరాబాద్ టూ విజయవాడ, హుజూర్ నగర్ - కోదాడ మీదుగా రైల్వేలైన్ కు ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రతిపక్షలు చేస్తున్న విమర్శలలో పసలేదని ప్రజా ప్రభుత్వం ప్రజలకిచ్చిన హమీలన్ని 100శాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు కళాకారులతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక్కొక్క పథకం పై అర్థమయ్యే విధంగా దృశ్యాలను ప్రదర్శించి వివరించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్క`తిక అకాడమీ చైర్మన్ డా. అలైఖ్య కుంజ్జాల కోదాడ, తుంగతుర్తి ఎమ్మేల్యేలు ఉత్తమ్ పద్మావతి, మందుల సామేలు, రాష్ట్ర టూరిజమ్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, రాష్ట్ర మార్కెట్ కమిటీ మెంబర్ చేవిటి వెంకన్న యాదవ్, హుజూర్ నగర్, కోదాడ, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్లు గెల్లి అర్చనరవి, ప్రమీళ, బచ్చలకూరి ప్రకాష్, వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Similar News