కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలు సాధించాలి

స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను నేటి తరం యువత సాధించాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం అన్నారు.

Update: 2024-11-24 10:48 GMT

దిశ,కోదాడ: స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను నేటి తరం యువత సాధించాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ప్రధాన రహదారి పై కోదాడ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో..ఏర్పాటు చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దేశ స్వాతంత్ర సముపార్ధనలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాలను ఆమె స్మరించారు. బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోదాడ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేయటం అభినందనీయమని పద్మశాలి సంఘం నాయకులను అభినందించారు. పద్మశాలీల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానన్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్, టిపిసిసి డెలిగేట్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు పద్మశాలి సంఘం తెలంగాణ ప్రాంత అధ్యక్షులు కమర్తపు మురళి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు అప్పం శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి గోపాల్, పద్మశాలి సేవా సంఘం కోదాడ పట్టణ అధ్యక్షులు గోలి నాగరాజు, నియోజకవర్గ అధ్యక్షులు కొంగర నరసింహారావు జిల్లా ఉపాధ్యక్షులు నక్క చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పిండిపోలు శ్రీనివాస్, కోశాధికారి గిరి ప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షులు కొండ వీరభద్రం, జిల్లా గౌరవ అధ్యక్షులు గంజి శంబయ్య, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తాటి మురళి ,పట్టణ సహాయ కార్యదర్శి పతంగి నరేష్, వనం ప్రభాకర్, పలు హోదాలో ఉన్న పద్మశాలి సంఘం నాయకులు ,ఉద్యోగులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు


Similar News