హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ పర్యటన
హుజూర్ నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మఠంపల్లి మండలంలో ఆదివారం నీటి పారుదల& పౌరసపార శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
దిశ,హుజూర్ నగర్ : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మఠంపల్లి మండలంలో ఆదివారం నీటి పారుదల& పౌరసపార శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆదివారం ఉదయం 10:30 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి చింతలపాలెం మండల కేంద్రానికి మధ్యాహ్నం 1 : 30 నిమిషాలకు చేరుకుంటారు. చింతలపాలెంలో తహసిల్దార్ ఎంపీడీవో పోలీస్ స్టేషన్ నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన తోపాటు చింతలపాలెం నుండి మేళ్లచెరువు వెళ్లే రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 3-00 గంటలకు చింతలపాలెం నుండి బయల్దేరి 3-30 నిమిషాలకు కిష్టాపురం చేరుకుంటారు . ప్రియ సిమెంట్ ఫ్యాక్టరీ నుండి కిష్టాపురం వెళ్లే రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుండి 3-30 బయలుదేరి సాయంత్రం 4-00 గంటల వరకు మఠంపల్లి చేరుకుంటారు. మఠంపల్లి నుండి హుజూర్ నగర్ వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి 4-30 హుజూర్ నగర్ బయలుదేరి 5-00 గంటలకు హుజూర్ నగర్ చేరుకుంటారు. హుజూర్ నగర్ పట్టణంలో జరిగే ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభలో పాల్గొంటారు .