CI Veerababu: దొంగలొస్తున్నారు జాగ్రత్త.. పొలాల్లో నిలువ ఉన్న ధాన్యమే టార్గెట్

గత కొన్ని సంవత్సరాల క్రితం సినిమా థియేటర్లలో, బస్టాండ్ లలో జేబు దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డులను చూస్తూ ఉండేవారం.

Update: 2024-11-24 03:07 GMT

దిశ, మిర్యాలగూడ: గత కొన్ని సంవత్సరాల క్రితం సినిమా థియేటర్ల(theatres)లో, బస్టాండ్(Bus stand) లలో జేబు దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డులను చూస్తూ ఉండేవారం. ప్రస్తుతం ధాన్యం దొంగలు(Grain thieves) వస్తున్నారు జాగ్రత్త అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దొంగలంటే ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువా తాళాలు పగలగొట్టి విలువైన వస్తువులను, డబ్బును దొంగిలించుకుని పోయేవారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ పొలాలలో నిల్వ ఉన్న వరి ధాన్యాన్ని టార్గెట్ గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ధాన్యం వద్ద ఎవరు లేని సమయం చూసుకొని రాత్రికి రాత్రే ధాన్యాన్ని మాయం చేస్తున్నారు. తెల్లారి రైతు చూసేసరికి ధాన్యం లేకపోవడంతో విస్తూ పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

పొలాల్లో నిలువ ఉన్న ధాన్యమే టార్గెట్

కోతల సీజన్ ప్రారంభం కావడంతో రైతులు కోసిన ధాన్యాన్ని రాత్రివేళ ఇంటికి తీసుకెళ్లకుండా పొలాలలోని నిల్వ ఉంచిన ధాన్యాన్ని దొంగలు టార్గెట్గా చేసుకుంటున్నారు. రాత్రిపూట ధాన్యం వద్ద రైతులు కాపలా ఉండకపోవడంతో అదునుగా భావించిన దొంగలు తెల్లవారేసరికి ధాన్యాన్ని దొంగిలించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఉదయాన్నే పొలానికి వచ్చిన రైతుకు దాన్యం లేకపోవడంతో అయోమయానికి గురైతున్నారు. దీంతో చేసేది ఏమీ లేక స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

వరస సంఘటనలతో రైతుల్లో ఆందోళన

ఇటీవల కాలంలో వరస సంఘటనలు చోటు చేసుకోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మాడుగుల పల్లి(Māḍugulapalli) మండలం పాములపాడు(Pāmulapāḍu) గ్రామానికి చెందిన రైతు పొలం నుంచి 20 కింటాల ధాన్యాన్ని చోరీ చేశారు. వేములపల్లి(Vemulapally) మండలం లక్ష్మీదేవి గూడెం(Lakṣmīdēvi gūḍeṁ) సమీపంలో పొలంలో నిల్వ ఉంచిన సుమారు 25 క్వింటాళ్ల ధాన్యాన్ని ట్రాక్టర్ లో లోడ్ చేసుకుని దొంగతనానికి పాల్పడ్డారు. మరో రెండు రోజుల లోపే మిర్యాలగూడ మండలం పచ్చారుగడ్డ సమీపంలో రైతు ధాన్యాన్ని(సుమారు 10 పుట్లు) లోడ్ చేసి ట్రాక్టర్‌ను గ్రామ సమీపంలోని పొలంలో ఉంచి ఇంటికి వెళ్ళాడు.

రాత్రికి రాత్రే అదే ట్రాక్టర్‌ను తీసుకువెళ్లి ధాన్యాన్ని అన్లోడ్ చేసి ట్రాక్టర్ ను తిరిగి తీసుకువచ్చి అదే స్థానంలో వదిలి పెట్టి వెళ్లిపోయారు. ఉదయాన్నే పొలానికి వచ్చిన రైతుకు ట్రాక్టర్ ఉంది కానీ అందులో ధాన్యం లేకపోవడంతో విస్తుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాక్టర్‌లో ధాన్యం కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రైతులు పేర్కొన్నారు.

రైతుల అప్రమత్తంగా ఉండాలి- రూరల్ సీఐ వీరబాబు

వరి ధాన్యాన్ని దొంగలిస్తుండడంతో రైతులు ధాన్యాన్ని పొలాలలో నిలువ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ధాన్యాన్ని అక్రమంగా చోరీకి పాల్పడుతున్న వారిని త్వరలోనే పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags:    

Similar News