Mahesh Babu: ఎవరికీ తెలియకుండా షూటింగ్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు.. ఫొటో వైరల్

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

Update: 2025-01-09 04:00 GMT

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు న్యూ లుక్‌లో కనిపించబోతున్నారు. అయితే రాజమౌళి ఈ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కించాలనే ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను రీసెంట్‌గా గుట్టు చప్పుడు కాకుండా చేసిన విషయం విదితమే. దీంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న ఫొటో‌ను బట్టి చూస్తుంటే.. తాజాగా మహేష్ బాబు ఓ షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళితో చేస్తున్న సినిమా పూజా కార్యక్రమం లాగే షూటింగ్ కూడా ఎవరికీ తెలియకుండా చేస్తున్నారని ఫ్యాన్స్‌లో ఒకటే చర్చ. ఇక ఈ విషయంపై ఆరా తీయగా.. మహేష్ బాబు షూటింగ్‌లో పాల్గొన్న మాట నిజమే కానీ అది SSMB29 మూవీ షూటింగ్ కాదని క్లారిటీ వచ్చింది. సూపర్ స్టార్ ఇటీవల ట్రూ జోన్ సోలార్ అనే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక దానికి సంబంధించిన యాడ్ షూట్‌లో మహేష్ బాబు తాజాగా పాల్గొన్నాడట. ఈ షూట్‌లో మహేష్‌తో పాటు మిల్క్ బ్యూటీ తమన్నా కూడా పాల్గొంది. కాగా వీరిద్దరు ‘ఆగడు’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News