Telugu Heroes: ‘గేమ్ ఛేంజర్‌’కు సపోర్ట్‌గా తెలుగు హీరోలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమా రేపు(శుక్రవారం, జనవరి 10, 2025) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

Update: 2025-01-09 14:28 GMT
Telugu Heroes: ‘గేమ్ ఛేంజర్‌’కు సపోర్ట్‌గా తెలుగు హీరోలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమా రేపు(శుక్రవారం, జనవరి 10, 2025) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇప్పటికే అన్ని భాషల్లో బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. హాట్ కేకుల్లా ఫ్యాన్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. దాదాపు ఐదారేళ్ల తర్వాత రామ్ చరణ్ స్ట్రైట్ సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘గేమ్ ఛేంజర్‌’కు మద్దతుగా ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. మెగా హీరో సాయి ధుర్గతేజ్, ఆది సాయి కుమార్, డైరెక్టర్ మలినేని గోపీచంద్ వంటి వారు బెస్ట్ విషెస్ చెబుతూ ట్వీట్స్ పెడుతున్నారు. తమిళ అగ్ర దర్శకుడు శంకర్(Shankar) తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్లుగా కియారా అద్వాణీ(Kiara Advani), అంజలి(Anjali) నటించారు. శ్రీకాంత్(Srikanth), ఎస్‌జే సూర్య(SJ Surya) కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మించారు.



 


Tags:    

Similar News