Jagga Reddy: నా రాజకీయ జీవితమే సినిమాలో నా పాత్ర.. జగ్గారెడ్డి మూవీ టీజర్ రిలీజ్
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి పాన్ ఇండియా లేవల్ మూవీలో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ (Congress) కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి (Jagga Reddy) పాన్ ఇండియా లేవల్ మూవీలో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్‌కు భారీ స్పందన వచ్చింది. ‘జగ్గారెడ్డి-ఏ వార్ ఆఫ్ లవ్’ సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా ఆదివారం జగ్గారెడ్డి మూవీ టీజర్ రిలీజ్ చేశారు. 50 సెకన్ల నిడివితో (Jagga Reddy Movie Teaser) జగ్గారెడ్డి టీజర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు నిర్మాత తూర్పు జయలక్ష్మీ రెడ్డి, రైటర్, డైరెక్టర్ రామానుజం.. జగ్గారెడ్డి జీవితంలోని పలు అంశాలను కథగా తెరకెక్కిస్తున్నారు. దెబ్బలు పడే కొద్ది శిల్పంలా మారడానికి రాయి కాదు.. తగిలే ప్రతి దెబ్బని ఆయుధంగా మార్చుకునే జగ్గారెడ్డి.. సంగారెడ్డి జగ్గారెడ్డి.. అంటూ టీజర్‌లో బ్యాక్ రౌండ్‌లో డైలాగ్ వినిపిస్తుంది.
జయలక్ష్మీ సినిమాస్ పేరుతో ఆదివారం నూతన ఆఫీస్‌ను సైతం జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. నా రాజకీయ జీవితమే సినిమాలో నా పాత్ర అని చెప్పారు. ఇకపై ఈ సినిమా కార్యాలయమే నా అడ్డ అని చెప్పుకొచ్చారు. విద్యార్థి నేతగా, కౌన్సిలర్‌గా, మున్సిపల్ చైర్మన్‌గా నా సక్సెస్ ఫుల్ ప్రయాణం సినిమాలో చూడబోతున్నారని వెల్లడించారు. కాగా, పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీని నిర్మిస్తున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.