Ram Charan: మెగా అభిమానులకు భారీ గుడ్ న్యూస్.. ఆ పండుగకు ‘పెద్ది’ నుంచి బిగ్ అప్డేట్ రాబోతుందంటూ మేకర్స్ ట్వీట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న తాజా చిత్రం ‘RC-16’.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న తాజా చిత్రం ‘RC-16’. ఈ సినిమాకు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchibabu Sana) దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిరాలు నిర్మిస్తున్నారు. అయితే ఈ పాన్ ఇండియా మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు ‘మీర్జాపూర్’ వెబ్‌సిరీస్‌లో మున్నాభయ్యాగా నటించిన దివ్యేందు శర్మ(Divyendu Sharma) విలన్‌గా నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాను సంగీతం అందిస్తున్నారు.
ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘RC-16’ చిత్రానికి ‘పెద్ది’ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ పోస్టర్ కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాను షేక్ చేసిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఉగాదికి రాబోతున్నాయని పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘పెద్ది’ అప్డేట్ రాబోతున్నట్లు తెలుపుతూ ట్వీట్ చేశారు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఏప్రిల్ 6న పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్ రాబోతున్నాయని తెలుపుతూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా రామ్ చరణ్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.