రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి..
వెళుతున్న రైలులో నుండి వ్యక్తి జారి పడిన సంఘటన షాద్ నగర్
దిశ, షాద్ నగర్ : వెళ్తున్న రైలులో నుండి వ్యక్తి జారి పడిన సంఘటన షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సొలిపూర్ వద్ద చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ నుంచి ఉందానగర్ వైపు వెళ్తున్న రైలులో దాదాపు 35 సంవత్సరాల వ్యక్తి లైట్ గ్రీన్ షర్ట్,బ్లాక్ కలర్ ప్యాంట్,వైట్ బనియన్ ధరించి ఉన్నాడు. అతను మార్గమధ్యలో షాద్ నగర్ రైల్వే స్టేషన్ చేరువలో సోలిపూర్ వద్దకు రాగానే జారిపడి పోయాడని తీవ్ర గాయాలైన వ్యక్తిని 108 సహాయంతో ఆసుపత్రికి తరలిస్తున్నారు. మార్గ మధ్యలో మృతి చెందాడని,స్టేషన్ మాస్టర్ అవదేశ్ ఫిర్యాదు మేరకు రైల్వే హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నమని అన్నారు. మృత దేహాన్ని షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచారని,వివరాలు తెలిస్తే 9848090426 నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు.