భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించిన కేసులో 5 గురికి యావజ్జీవ శిక్ష

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్యతో పాటు మరో మరో నలుగురు ముద్దాయిలJI యావజ్జీవ కారాగార శిక్ష,

Update: 2025-01-09 14:28 GMT

దిశ, కడప: అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్యతో పాటు మరో మరో నలుగురు ముద్దాయిలJI యావజ్జీవ కారాగార శిక్ష, మరియు ఒక్కొక్కరికి రూ.2 లక్షల జరిమానా విధిస్తూ సెకండ్ ఏ.డి.జె ప్రొద్దుటూరు కోర్టు జడ్జి జి.ఎస్ రమేష్ కుమార్ గురువారం సాక్ష్యాధారాలను పరిశీలించి శిక్ష విధించారు. ఈ కేసుకు సంబంధించి హతుడు తండ్రి కుమ్మరి చిన్న బాలిశెట్టి కథనం మేరకు వివరాలు ఇలా వున్నాయి. మైలవరం మండలం తొర్రివేముల గ్రామానికి చెందిన కుమ్మరి చిన్న బాలిశెట్టి ఇద్దరు కుమారులు. సంతానంలో మొదటివాడు కుమ్మరి గురుప్రసాద్, రెండవవాడు కుమ్మరి గురు స్వామి ఇద్దరు బేల్దారి పని చేస్తు జీవిస్తూ ఉండేవారు. హతుడు గురు ప్రసాద్ మొదటి సంతానం. హతునికి ఏ 5 కుమ్మరి విజయ ప్రమీణలతో 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ సంతానం ఉన్నారు. ప్రమీల కు గ్రామంలో చిల్లర అంగడి ఉండేది. ప్రమీల జమ్మలమడుగు కు అంగడి సరుకుల కోసం ఎ1 సురేష్ ఆటో లో పోతూ ఆ క్రమంలో అతనితో అక్రమ సంబంధం ఏర్పడింది.

ఈ విషయం తెలిసిన భర్త అయిన హతుడు తన భార్య ప్రమీలను మందలించారు. అది సహించని ప్రమీల మిగతా ముద్దాయిలు ఏ 2 కొమ్ము పెద్ద రాజు, ఏ 3 చాకలి గురు స్వామి, ఏ 4 ఉప్పలపాడు ఓబుల్ ప్రతాప్ తో కలిసి వేపరాల కు బేల్దారి పనికి గురుప్రసాద్ తన తమ్ముడితో కలిసి వెళ్ళి 2019 జనవరి 24 మధ్యాన్నం భోజనంకు తిరిగి వస్తున్న విషయం ప్రమీల మిగతా ముద్దాయిలకు తెలిపిందన్నారు. ముద్దాయిలు బాబూ సాబ్ బావి దగ్గర కాపుకాసి రాడ్లతో కొట్టి కుమ్మరి గురు ప్రసాద్ ను దారుణంగా హత్య చేశారు. హతుని తమ్ముడు గురు స్వామి అది చూసి అరవగా ముద్దాయిలు చంపుతామని బెదిరించారు.గురుస్వామి పారిపోయి వచ్చి తండ్రి కి తెలపడంతో మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున అడిషనల్ పి.పి బి.రాంప్రసాద్ రెడ్డి బలమైన వాదనలతో నిందితులకు శిక్ష పడేలా కృషి చేశారు. సాక్ష్యాధారాలతో నేరం రుజువు చేసి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్.పి విద్యాసాగర్ నాయుడు అభినందించారు.


Similar News