హైదరాబాద్‌లోని షాపింగ్ మాల్స్‌లో GST అధికారుల దాడులు
హైదరాబాద్ వ్యాప్తంగా జీఎస్టీ అధికారులు(GST Officials ) దాడులు చేశారు. జీఎస్టీ ప్రత్యేక కమిషనర్ ఆదేశాలతో పలు షాపింగ్ మాల్స్(HYD Shopping Malls)లో గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వ్యాప్తంగా జీఎస్టీ అధికారులు(GST Officials ) దాడులు చేశారు. జీఎస్టీ ప్రత్యేక కమిషనర్ ఆదేశాలతో పలు షాపింగ్ మాల్స్(HYD Shopping Malls)లో గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వ్యాపార లావాదేవీలు, జీఎస్టీ(GST)కి సంబంధించిన లెక్కల్లో పొంతన లేకపోవడంతో తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా షాపింగ్‌మాల్స్‌లో పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నగర వ్యాప్తంగా 25 ప్రత్యేక బృందాలతో సోదలు చేశారు. దాదాపు 10 రోజులుగా ఈ దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. మరోవైపు నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల దృష్ట్ర్యా దుకాణాల్లో భారీగా వస్త్రాలు నిల్వలు చేసినట్లు సమాచారం. అధికారుల తనిఖీలతో కూడలిలోని మిగతా దుకాణ యజమానులు అప్రమత్తమయ్యారు.