విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది.
దిశ, మేడ్చల్ టౌన్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండల దొబ్బగూడెంకు చెందిన శంకర్(30) విద్యుత్ కార్యాలయంలో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గురువారం గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని మైసమ్మగూడలో ఉన్న మల్లారెడ్డి కళాశాల వద్ద శంకర్ సంబంధిత కాంట్రాక్టర్ ఆదేశాల మేరకు కరెంట్ పోల్ ఎక్కి చెట్లు కొడుతుండగా విద్యుత్ షాక్ కొట్టి స్తంభం పైనే మృతి చెందాడు.
అది గమనించిన స్థానిక విద్యుత్ అధికారి విజయ్ కుమార్ స్తంభం పై నుంచి శంకర్‌ను కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేసి, కాంట్రాక్టర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.