ఖండాంతరాలు దాటిన ప్రేమ..వియత్నం అమ్మాయితో తెలుగబ్బాయి పెళ్లి

తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలల్లో ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం వెళుతున్న యువత పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

Update: 2024-11-25 14:21 GMT

దిశ, చండూరు: తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలల్లో ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం వెళుతున్న యువత పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలాగే మరో తెలుగు యువకుడి ప్రేమ కథ ఖండాంతరాలను దాటింది. నల్లగొండ జిల్లా చండూరు మున్సిపల్ కేంద్రానికి చెందిన పాంపాటి భాస్కర్ శోభ దంపతుల మొదటి కుమారుడు ఉద్యోగరీత్యా 2017లో వియత్నం వెళ్లారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ..అక్కడే హోటల్స్ స్థాపించి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వంలో యూత్ మినిస్ట్రీ సెక్రటరీగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న..అమ్మాయి నీనా పరిచయం కావడం పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఆమె అక్కడి ఉద్యోగానికి రాజీనామా చేసి..పాంపాటి సందీప్ తో వివాహానికి ఇండియా రావడం జరిగింది. చండూరు మండల కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. మొత్తానికి చండూరు అబ్బాయి వియత్నం అల్లుడు అయ్యారంటు స్థానికంగా చర్చించుకుంటున్నారు.


Similar News