రైతుల భూములు అమ్మి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు: మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్

రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రైతుల భూములు అమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుతుందని, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు.

Update: 2022-11-25 05:41 GMT

దిశ, దేవరకొండ/ కొండమల్లేపల్లి: రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రైతుల భూములు అమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుతుందని, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు కొండమల్లేపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు, ఈ సందర్భంగా బాలునాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడైతే భూములు ఉన్నాయో.. అట్టి భూములు స్వాధీనం చేసుకోవడానికి ధరణి పోర్టల్ ను ప్రయోగించి పేదల భూములు లాక్కొని ధరణిలో నమోదు కానటువంటి భూములు అమ్ముకొని తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆయన ఆరోపించారు.

ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల పేదల భూములు ధరణిలో లేవంటూ వేల కోట్ల రూపాయలకు అమ్ముకొని ప్రభుత్వాన్ని గట్టేక్కిస్తున్నారని.. అంతే కాకుండా రానున్న రోజుల్లో పట్టణాల్లో పల్లెల్లో రైతుల పేరు మీద ఉన్న భూములను ధరణిలో లేనట్లయితే వాటిని కూడా అమ్మి రైతులను మోసం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ధరణి పోర్టల్‌ను రద్దుచేసి, రెవెన్యూ చట్టంలో సవరించిన విధంగా రైతులకు మేలు జరిగే విధంగా రికార్డులు తయారు చేసి వారికి రావాల్సిన భూములను వారి పేరు మీద పట్టాలు చేసి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

అంతేకాకుండా రాష్ట్రంలో పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని ఆయన అన్నారు. లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి, టీపీసీసీ మెంబర్ పీఏసీఎస్ చైర్మన్ డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటయ్య, ఎం ఏ సిరాజ్ ఖాన్, సర్పంచులు శ్రీరాములు, అయ్యన్న, శివయ్య, రవి నాయక్, పెద్ది శెట్టి సుధాకర్, కైసర్ ఖాన్, వస్కుల బక్కయ్య, ఖదీర్, కొర్ర నాగరాజు తదితరులు పాల్గొన్నారు,

Tags:    

Similar News