అయ్యప్ప దర్శనం చేసుకుని తిరిగి వస్తూ.. మాజీ ఎంపీటీసీ హఠాన్మరణం
అయ్యప్ప మాలధారులై శబరిమలలో స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో చిత్తూరు జిల్లా అలిపిరిలో మండలానికి చెందిన ఆర్లెగూడెం మాజీ ఎంపీటీసీ మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..
దిశ, చిలుకూరు: అయ్యప్ప మాలధారులై శబరిమలలో స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో చిత్తూరు జిల్లా అలిపిరిలో మండలానికి చెందిన ఆర్లెగూడెం మాజీ ఎంపీటీసీ మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. ఆర్లెగూడెం మాజీ ఎంపీటీసీ సాగర్ల భద్రమ్మ(55) తన భర్త, మాజీ సర్పంచ్ రామనర్సయ్య తో కలిసి ఇటీవల అయ్యప్ప మాల ధరించారు. మాలధారణ సమయం ముగిసిన అనంతరం గ్రామానికి చెందిన మరికొందరు మాలధారులతో కలిసి ప్రైవేటు బస్సులో శబరి వెళ్లారు. మూడు రోజుల క్రితం అయ్యప్ప దర్శనం తరువాత వారంతా తిరుపతి బయలుదేరారు.
శుక్రవారం ఉదయం అలిపిరి చేరుకున్నారు. అందరూ బాలాజీ దర్శనం చేసుకునేందుకు సిద్ధమవుతుండగా భద్రమ్మ ఎంతకీ లేవలేదు. అనుమానం వచ్చిన తోటివారు ఆమెను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా ఆమె అప్పటికే తన సీట్లో మృతి చెంది కనిపించారు. గురువారం రాత్రి ఆమె కాస్త అస్వస్థతకు గురైనట్టు సమాచారం. దీంతో మృతదేహాన్ని అలిపిరి నుంచి అంబులెన్స్ లో ఆర్లెగూడేనికి తీసుకు వస్తున్నారు. ఆమె మృతికి సర్పంచ్ మామిడి నాగమణి చిన రాములు, ఎంపీటీసీ గువ్వల జయమ్మ నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ సాగర్ల నాగేశ్వరరావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
Read more ......