సీఎంఆర్‌లో మిల్లర్ల నిర్లక్ష్యం.. ఇంకా ప్రభుత్వానికి అప్పగించని బియ్యం

ప్రభుత్వాలు మారిన మిల్లర్ల తీరు మారడం లేదు. ప్రభుత్వానికి మిల్లర్లు ఇవ్వాల్సిన సీఎంఆర్ ను (క్లస్టమ్ మిల్లింగ్ రైస్ )మిల్లర్లు ఎగవేస్తున్నారు.

Update: 2024-07-03 02:33 GMT

దిశ , నల్గొండ బ్యూరో: ప్రభుత్వాలు మారిన మిల్లర్ల తీరు మారడం లేదు. ప్రభుత్వానికి మిల్లర్లు ఇవ్వాల్సిన సీఎంఆర్ ను (క్లస్టమ్ మిల్లింగ్ రైస్ )మిల్లర్లు ఎగవేస్తున్నారు. లక్షల టన్నుల బియ్యం సిఎంఆర్ పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి క్వింటాకు 65 కిలోల చోప్పున బియ్యం లేక్కలు చూపాల్సి ఉంది. అయితే మిల్లర్ల 2022-23 యాసంగి సిజన్ కు గడువు మిగిసిన నేటికి మిల్లర్లు తమ లక్ష్యాన్ని పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైయ్యారని ఆరోపణలున్నాయి.

లక్ష్యం నీరు గారుతుంది..

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మిల్లర్లు చెల్లింపు లక్ష్యాన్ని ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని పేర్కోంది. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా లో ఎక్కువ పెండింగ్ లో ఉన్నాయి. నల్లగొండ ,సూర్యాపేట ,యాదాద్రి భవనగిరి జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 2022-23 యాసంగి పంటలకు సంబంధించి సీఎంఆర్ చెల్లింపులో జాప్యం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో మార్చి నెల లెక్కాల ప్రకారం 6,91,779 టన్నుల ధాన్యం సేకరించగా 4,66,950 టన్నుల బియ్యం సీఎంఆర్ చెల్లించాల్సి ఉండగా కేవలం 2,65,524 మాత్రమే చెల్లించారు. సూర్యాపేట జిల్లా లో 3,61,445 ధాన్యం సేకరించగా 2,43,479 టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉండగా 40,842 మాత్రమే చెల్లించారు.

సూర్యాపేట జిల్లాలో అతి తక్కువ సీఎంఆర్ చెల్లించినట్లు లెక్కలు చెబుతున్నాయి. సీఎంఆర్ సకాలంలో చెల్లించని మిల్లర్లపై ఇటీవల సివిల్ సప్లై అధికారులు చర్యలు తీసుకున్నారు. యాదాద్రి జిల్లాలో 4,11,182 టన్నుల ధాన్యం సేకరించిన మిల్లర్లు 2,77,587 సీఎంఆర్ చెల్లించాల్సి ఉన్నప్పటికి 1,54,310 చెల్లించి చేతులు దులుపుకున్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు 5 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ చెల్లించాల్సి ఉంది. దీంతో కోట్ల రూపాయాలు విలువ చేసే సీఎంఆర్ ను మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణాలున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. సీఎంఆర్ చెల్లించకుండా మిల్లర్లు బాకాయిలు పెడుతూ కాలం వెల్లదీస్తున్నారు.

అధికారుల చర్యలు నామామాత్రం ..

ఒక పక్కా ప్రభుత్వం సీఎంఆర్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్న సంబంధిత అధికారులు నిమ్మకు నిరెత్తినట్లు వ్వవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సీఎంఆర్ ఎగవేస్తున్న మిల్లర్లపై అధికారులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారని ఆరోపణలున్నాయి. లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ చెల్లింపులు రాబట్టడంలో అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో గత ప్రభుత్వం నుంచి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు జారీ చేస్తున్న ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. జిల్లా స్ధాయిలో కలెక్టర్ లు సీఎంఆర్ చెల్లింపులో జాప్యం చేయకుండా 100 శాతం చెల్లించాలి చెప్పిన మిల్లర్లు పెడచెవిన పెడుతున్నారు. రోజుకు 4000 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉండగా కేవలం 50 శాతం మాత్రమే చెల్లిస్తున్నారని సమాచారం. సిఎంఆర్ చెల్లించని మిల్లుల పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చెబుతున్న ఏమి పట్టనట్లు వ్యవ హరిస్తున్నారు.

2023 -24 లో అంతంతా మాత్రమే సిఎంఆర్..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2023-24 ఖరీఫ్ రబీ సిజన్ లలో సిఎంఆర్ ను మిల్లర్లు అంతంతా మాత్రంగానే ఎఫ్ సి ఐ కి సరాఫరా చేశారు. నల్గొండ జిల్లాలో ఖరీఫ్ లో 2 ,16,000 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 1,20,243 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చారు. ఇంకా సుమారు 96 వేల మెట్రిక్ టన్నుల పెండింగ్ ఉన్నది. రబీలో 2,08,000 లక్షల మెట్రిక్ టన్నుల కు గాను కేవలం 79 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. ఇంకా 1,29,000 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం చెల్లించాల్సి ఉంది.

సూర్యాపేట జిల్లాలో..

సూర్యాపేట జిల్లాలో 2023-24 ఖరీఫ్ లో 1,39,436 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్ సిఐ కి ఇవ్వాల్సి ఉండగా 54,136 మెట్రిక్ టన్నులు చెల్లించారు. ఇంకా 85,300 మెట్రిక్ టన్నులు చెల్లించాల్సి ఉంది. రభీ లో 1,63,561 లక్షల మెట్రిక్ టన్నులు చెల్లింపులకు 9761 వేల మెట్రిక్ టన్నుల ఇచ్చారు. ఇంకా 1,53,719 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్నది. సూర్యాపేట జిల్లాలో సోమయ్య అనే రైస్ మిల్లు యాజమాని రూ.200 కోట్ల విలువ చేసే సిఎంఆర్ ఇవ్వడంలో జాప్యం చేయడంతో అధికారులు ఆయన ను అరెస్టు చేసినట్లు తెలిసింది.

యాదాద్రి భువనగిరి జిల్లాలో..

యాదాద్రి భువనగిరి జిల్లాలో 2023-24 ఖరీఫ్ సిజన్ లో 2,65,197 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా 86,339 మెట్రిక్ టన్నులు చెల్లించారు. ఇంకా సుమారు 90,843 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. రభీలో 2,70,636 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన మిల్లర్లు 32,973 వేల మెట్రిక్ టన్నులు చెల్లించారు. ఇంకా 1,51,059 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రావాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ జిల్లాలో 2022-23 కు సంబంధించి ఓ మిల్లర్ ఏకంగా రూ.4 కోట్ల విలువ చేసే సీఎంఆర్ బకాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

గడువులోగా పూర్తి అయ్యేనా..

ప్రభుత్వానికి మిల్లర్లు చెల్లించే సీఎంఆర్ ఈ ఏడాది సెప్టెంబర్ లోగా పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే మిల్లర్లు 2022-23 లో సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల ఇవ్వాల్సి ఉండగా,2023-24 లో ఖరీఫ్ రబీ సిజన్ లకు కలిపి సుమారు 7.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్ సి.ఐ కి చెల్లించాల్సి ఉన్నది. గడువు మూడు నెల ల ఉండటంతో చెల్లింపుల పక్రియ పూర్తి కావడంపై అనుమానాలున్నాయి.


Similar News