బుద్ధవనం లో శ్రీలంక మీడియా ప్రతినిధుల బృందం...

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో శ్రీలంక ప్రధానమంత్రి సలహాదారు సుగీ స్వర, పి. సేన ధీర నేతృత్వంలో శ్రీలంక లోని వివిధ ప్రావిన్స్ లలో పౌర సంబంధాల శాఖలో పనిచేసే అధికారులు,

Update: 2024-07-05 15:15 GMT

దిశ, నాగార్జునసాగర్: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో శ్రీలంక ప్రధానమంత్రి సలహాదారు సుగీ స్వర, పి. సేన ధీర నేతృత్వంలో శ్రీలంక లోని వివిధ ప్రావిన్స్ లలో పౌర సంబంధాల శాఖలో పనిచేసే అధికారులు, శ్రీలంక మీడియా ప్రతినిధుల బృందం గత నెల 24 నుంచి ఈ నెల 7వ వరకు హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ నిమిత్తం భారతదేశం చేరుకున్నారు. వీరు 15 రోజుల శిక్షణలో భాగంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వం, మీడియా తదితర అంశాలపై శిక్షణ పొందనున్నారు. ఈ బృందం ముందుగా హైదరాబాద్, వరంగల్, జహీరాబాద్ తదితర ప్రాంతాలను సందర్శించి, శుక్రవారం 30 మంది ప్రతినిధుల బృందం తో నాగార్జునసాగర్ విచ్చేయగా, వారికి విజయ విహార్ వద్ద మిర్యాలగూడ ఆర్డిఓ శ్రీనివాసరావు, నల్గొండ జిల్లా సమాచార శాఖ సహాయ సంచాలకులు యు. వెంకటేశ్వర్లు పూల బొకేలతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వారికి బుద్ధ వనం, నాగార్జున కొండ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వివరాలను ఆర్డిఓ ,ఏడీలు వారికి వివరించారు. బుద్ధవనం గైడ్ సత్యనారాయణ నాగార్జున కొండ సందర్శన సందర్భంగా వాటి విశేషాలను , ప్రాముఖ్యతను పాత్రికేయులకు వివరంగా తెలియజేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు అసిస్టెంట్ ఇంజినీర్ సత్యనారాయణ ప్రాజెక్టు వివరాలను తెలియజేయగా, కోర్సు డైరెక్టర్ గా డాక్టర్ ఆర్. మాధవి వ్యవహరించగా, ఫ్యాకల్టీ గా డాక్టర్ కే. సురేష్ కుమార్, పెద్దవూర డిప్యూటీ తహసీల్దార్ శరత్, ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు శ్రీలంక బృందం తో ఉన్నారు.


Similar News