దేవాలయాల్లో హుండీల దొంగ అరెస్టు

దేవాలయాల్లో హుండీలు, ఇత్తడి గంటలు చోరీ చేసే దొంగను కోదాడ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

Update: 2024-07-05 14:29 GMT

దిశ,కోదాడ : దేవాలయాల్లో హుండీలు, ఇత్తడి గంటలు చోరీ చేసే దొంగను కోదాడ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పట్టణ సీఐ రాము తెలిపిన వివరాల ప్రకారం… హుజూర్ నగర్ కు చెందిన మామిడి గోపి జులాయిగా తిరుగుతూ.. దొంగతనాలకు అలవాటు పడ్డాడు..పెన్ పహాడ్, నూతనకల్, కూసుమంచి పోలీస్ స్టేషన్ పరిధిలో దేవాలయాల్లో హుండీలు గంటలు చోరీ చేసినట్లు తెలిపారు. వీటితోపాటు మిర్యాలగూడ,కోదాడ ల్లో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసినట్లు తెలిపారు. నిందితుడు దేవాలయంలో చోరీ చేసిన వస్తువులు అమ్మడానికి కోదాడకు రాగా వాహనాల తనిఖీల్లో నేరస్థుని పట్టుకున్నారు. అతని వద్ద నుండి రెండు మోటారు సైకిళ్ళు ఒక ఆటో నాలుగు ఇత్తడి గంటలు, నగదును స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. వారి వెంట పట్టణ ఎస్సై రంజిత్ రెడ్డి, ఐడి పార్టీ హెడ్ కానిస్టేబుల్ బాల్తు శ్రీనివాస్, సతీష్ నాయుడు, ఎల్లారెడ్డి, నాగేశ్వరరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News