ఈ నెల 16న జరిగే సభకు రండి.. మంత్రులను ఆహ్వానించిన ఎమ్మెల్యే..

మాదిగల ఏబీసీడీల వర్గీకరణ, బీసీ కులగణన చేయడాన్ని హర్షిస్తూ ఈనెల 16న తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వానికి కృతజ్ఞతా సభ నిర్వహించనున్నారు.

Update: 2025-03-14 11:06 GMT
ఈ నెల 16న జరిగే సభకు రండి.. మంత్రులను ఆహ్వానించిన ఎమ్మెల్యే..
  • whatsapp icon

దిశ, తుంగతుర్తి : మాదిగల ఏబీసీడీల వర్గీకరణ, బీసీ కులగణన చేయడాన్ని హర్షిస్తూ ఈనెల 16న తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వానికి కృతజ్ఞతా సభ నిర్వహించనున్నారు. ఈ సభ కార్యక్రమానికి హాజరు కావాలంటూ తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను కోరారు. ఈ మేరకు సామేల్ శుక్రవారం హైదరాబాదులో వారిద్దరిని కలిశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సామ అభిషేక్ రెడ్డి, అర్వపల్లి మండల కేంద్రంలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఇందుర్తి వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Similar News