సూర్యాపేట జిల్లాకు 1810 క్యూసెక్కుల ఎస్సారెస్పీ జలాలు
సూర్యాపేట జిల్లాకు వస్తున్న శ్రీరామ్ సాగర్ రెండో దశ (ఎస్సారెస్పీ) జలాల

దిశ,తుంగతుర్తి : సూర్యాపేట జిల్లాకు వస్తున్న శ్రీరామ్ సాగర్ రెండో దశ (ఎస్సారెస్పీ) జలాల సామర్థ్యాన్ని అధికారులు శుక్రవారం ఉదయం 7.30 గంటలకు మరింత పెంచారు.ఈ మేరకు ఒక వేయి 810 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఆ శాఖ డీఈ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.0.480 టీఎంసీల సామర్థ్యం కలిగిన బయన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో ప్రస్తుతం 0.444 నీటి నిల్వ ఉన్నట్లు తెలిపారు.వచ్చే నీటిని పొదుపుగా వాడుకోవాలని వారు రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.