హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.. : గంగిడి మనోహర్ రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను మాసాలు

Update: 2025-03-22 02:56 GMT
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.. : గంగిడి మనోహర్ రెడ్డి
  • whatsapp icon

దిశ, చండూరు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను మాసాలు కావస్తున్న ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి విమర్శించారు. ఈనెల 24 నుంచి వచ్చేనెల మూడు వరకు ఆరు గ్యారంటీలలో భాగమైన మహాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి,తులం బంగారం, మహిళలకు స్కూటీ పథకాలకు అర్హులైన అందని లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి తహశిల్దార్, కలెక్టర్ కార్యాలయల వద్ద ధర్నాలు నిర్వహించి ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వానికి రుచి చూపిస్తామన్నారు.శుక్రవారం చండూరు మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్ర అప్పు ఏడు లక్షలు ఉందని తెలిసిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎందుకు చెప్పారని ప్రశ్నించారు.

పథకాలన్నీ ఆర్భటంగా ప్రారంభించటం తప్ప అమలు కావటం లేదన్నారు. ముఖ్యమంత్రి రోజు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించే మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు మరిచిపోయారాన్నారు.ఇంటిగ్రెటెడ్ పాఠశాలల పనులు నేటికీ ప్రారంభం కాలేదన్నారు. ముఖ్యమంత్రి రోజు గత ప్రభుత్వ అప్పులను బూచిగా చూపిస్తూ అధికారంలో వున్న ప్రతిపక్ష పార్టీ నేతగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బి ఆర్ ఎస్ చేసిన మోసం పై ప్రజల ఇంకా ఆ పార్టీ నేతలను నిలదీస్తున్నారని అన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదని ప్రజాకోర్టులో దోషిగా నిలబెడతామని హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకు పోయి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల మరియు మున్సిపల్ అధ్యక్షులు ముదిగొండ ఆంజనేయులు, పందుల సత్యం గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ దూడల బిక్షం గౌడ్, అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ కాసాల జనార్దన్ రెడ్డి, సీనియర్ నాయకులు బొబ్బల మురళి మనోహర్ రెడ్డి, యువ మోర్చా రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి, భూతరాజు శ్రీహరి, జిల్లా నాయకులు అన్నేపర్తి యాదగిరి, ఏనుగు వెంకట్ రెడ్డి,సింగిల్ విండో డైరెక్టర్ బోడ ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ రావిరాల శ్రీను, ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు ఇరిగి ఆంజనేయులు, నాయకులు పడసనబోయిన శ్రీను, వరికుప్పల గిరి, మాదగోని వెంకన్న, భూతరాజు స్వామి, మండల నాయకులు నల్లపరాజు యాదగిరి, యువ మోర్చా జిల్లా నాయకులు బొబ్బల శివ, సోమ శంకర్, పేర్ల గణేష్, దోటి శివ, వేముల పవన్, వివిధ మోర్చాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News