బావిలో ఈత.. తీవ్ర విషాదం

బావిలో ఈత తీవ్ర విషాదాన్ని మిగిల్చింది..

Update: 2025-03-23 13:22 GMT
బావిలో ఈత.. తీవ్ర విషాదం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: బావి(Well)లో ఈత(Swimming) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సరదాగా ఎంజాయ్ చేద్దామనుకున్న ఇద్దరు యువకుల ప్రాణాలను నీటిలో కలిపేసింది. ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన నవీన్‌, రాఘవేంద్ర మంచి స్నేహితులు. ఇవాళ ఆదివారం, పైగా ఎండల తీవ్రతతో ఇద్దరు సేద తీరుదామనుకున్నారు. ఈ మేరకు బావిలో ఈత కొడదామని అనుకున్నారు. బావి వద్దకు వెళ్లి అందులో దిగి ఈత కొడుతున్నారు. అయితే ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాఘవేంద్ర నీటిలో మునిగిపోయారు. దీంతో రాఘవేంద్రను రక్షించేందుకు ప్రయత్నం చేసిన నవీన్ కూడా నీటిలో మునిగిపోయారు. నీళ్లలో ఊపిరాడక ఇద్దరు మృతి చెందారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బావి వద్దకు వెళ్లిన పోలీసులు.. స్థానికుల సాయంతో రాఘవేంద్ర, నవీన్ మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. ఎంతో ఉత్సాహంగా కనిపించే నవీన్, రాఘవేంద్ర ఇక లేరని తెలిసి గ్రామస్తులు సైతం కంటతడి పెట్టుకున్నారు. ఇక కుటుంబ సభ్యులైతే శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Tags:    

Similar News