విశ్వవిద్యాలయ అభివృద్ధి కై ప్రత్యేక శ్రద్ధ.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఆకస్మిక పర్యటన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ సర్వతోముఖాభివృద్ధికి సర్వదా సిద్ధమని ఆకస్మిక పర్యటనలో తెలిపారు.

Update: 2025-03-29 16:04 GMT

దిశ, నల్లగొండ : మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఆకస్మిక పర్యటన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ సర్వతోముఖాభివృద్ధికి సర్వదా సిద్ధమని ఆకస్మిక పర్యటనలో తెలిపారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను బడ్జెట్ గా మార్పునకు, కొత్త కోర్సుల ప్రవేశ పెట్టే ప్రణాళికలను అందించాలని సూచించారు. ఉత్తమ పరిశోధనలు జరగాలని, విశ్వవిద్యాలయ అభివృద్ధికి మరిన్ని ప్రణాళికలతో ముందుకు రావాలని సూచించారు. నాణ్యమైన విద్యనందిస్తూ విశ్వవిద్యాలయ ప్రతిష్ట పెంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమములో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐక్యూ ఏసీ డైరెక్టర్ డా మిర్యాల రమేష్, ఆడిట్ సెల్ డైరెక్టర్ డావై.ప్రశాంతి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ప్రిన్సిపాల్ డాకె.ప్రేమ్ సాగర్, సుధారాణి, డా.మారం వెంకటరమణారెడ్డి, డా నీలకంఠం శేఖర్, తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

Similar News