నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి నల్గొండ జిల్లా(Nalgonda District)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చివ్వెంల మండలం బీబీగూడెం వద్ద ఆర్టీసీ బస్సు(Rtc Bus)ను కారు(Car) ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ప్రమాదంతో రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఘటనకు అతివేగమే కారణమని అంచనా వేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.