ఏవండోయ్ ఈ వింత చూశారా..?

సృష్టిలో విచిత్రాలు అనేకం. ఇందులో భాగంగానే ఆరు కాళ్లతో ఓ గొర్రె పిల్ల జన్మించడం ఆశ్చర్యానికి గురిచేసింది.

Update: 2025-03-23 12:27 GMT
ఏవండోయ్ ఈ వింత చూశారా..?
  • whatsapp icon

దిశ,తుంగతుర్తి: సృష్టిలో విచిత్రాలు అనేకం. ఇందులో భాగంగానే ఆరు కాళ్లతో ఓ గొర్రె పిల్ల జన్మించడం ఆశ్చర్యానికి గురిచేసింది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పసునూరు గ్రామంలో ఆదివారం ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. ఉప్పుల లింగమల్లు గొర్ల కాపరి తనకున్న గొర్లలో ఓ గొర్రె ప్రసరించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ గొర్రె పిల్లకు ముందు రెండు కాళ్లు వెనక భాగంలో ఆరు కాళ్లు ఉన్నాయి. జన్మించిన గొర్రెపిల్ల ఆరోగ్యంగానే ఉన్నట్లు యజమాని లింగమల్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వారంతా అక్కడికి చేరుకొని ఆశ్చర్యానికి గురైయ్యారు. సంఘటనపై పలువురు రకరకాలుగా వ్యాఖ్యానించారు.సృష్టిలో విచిత్రాలు అనేకం. ఇందులో భాగంగానే ఆరు కాళ్లతో ఓ గొర్రె పిల్ల జన్మించడం ఆశ్చర్యానికి గురిచేసింది.


Similar News