అన్ని పండుగలను గుర్తించి గౌరవించింది కేసీఆరే..: సూర్యాపేట ఎమ్మెల్యే
దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని మతాలకు కులాలకు గుర్తించి

దిశ,నేరేడుచర్ల : దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని మతాలకు కులాలకు గుర్తించి ప్రాధాన్యత ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆరే అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని నేరేడుచర్ల పట్టణంలో జానపాడు రోడ్ లోని మసీదులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తో పాటు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసే కటిన ఉపవాస దీక్షలు ఫలించాలని ఆ అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందడుగు వేసి అన్ని పండుగలను గౌరవించారన్నారు.
తెలంగాణలో గంగ జమున తహజీబ్ లా ఒకరి పండుగలను ఒకరు గౌరవించే విధానం రావాలని అది ప్రభుత్వం తోనే మొదలు కావాలని భావించారన్నారు. అందులో భాగంగానే దసరాకు బతుకమ్మ చీరలు, క్రిస్మస్ కు క్రిస్టియన్ సోదరులకు తోఫాలు, ప్రేమవిందు,, ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులతో పాటు తోఫా అందజేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అద్భుతమైన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం దీన్ని కొనసాగిస్తూ ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం హర్షణీయమని తోఫా కూడా పంచితే బాగుండేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగను జరుపుకోవాలని కోరుతూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు అరిబండి సురేష్ బాబు డిసిసిబి డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి మాజీ ఎంపీపీలు చెన్నబోయిన సైదులు లంకమల్ల జ్యోతి ,చిత్తలూరి సైదులు కిష్టిపాటి అంజిరెడ్డి కోప్పుల సైదిరెడ్డి కడియం వెంకటరెడ్డి కృష్ణ నాయక్ రాపోలు నవీన్ పల్లెపంగు నాగరాజు ముస్లిం మత పెద్దలు ఇబ్రహీం ఖాదర్ హుస్సేన్ కాజా జానీ పాల్గొన్నారు.