జర్నలిస్టు పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలి..
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో జర్నలిస్ట్ కాంపాటి సందీప్ పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు దొంతగాని రాజా రమేష్, tuwj, 143 నియోజకవర్గ అధ్యక్షులు త్రిపురం రమేష్ రెడ్డి, ఆత్కూరి వెంకటేష్ డిమాండ్ చేశారు.

దిశ, హుజుర్ నగర్ : సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో జర్నలిస్ట్ కాంపాటి సందీప్ పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు దొంతగాని రాజా రమేష్, tuwj, 143 నియోజకవర్గ అధ్యక్షులు త్రిపురం రమేష్ రెడ్డి, ఆత్కూరి వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం హుజూర్ నగర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేసి ఆర్డీఓ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూర్నగర్ నియోజకవర్గ రాజ్ న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ కంపాటి సందీప్ పై మఠంపల్లి తహశీల్దార్ అక్రమంగా కేసు పెట్టారని ఈ విషయం పై కలెక్టర్ బహిరంగ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
మఠంపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులతో మండలంలోని భూముల వివరాలను స్కాన్ చేయించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు విధి నిర్వహణలో భాగంగా వీడియోలు తీసిన కంపాటి సందీప్ పై తహశీల్దార్ అక్రమ కేసు పెట్టారని అన్నారు. ప్రైవేటు వ్యక్తుల చేత ప్రభుత్వ రికార్డులను స్కాన్ చేయించిన అధికారులు వారి ఉద్యోగాలు కాపాడుకునే క్రమంలో వీడియో తీసిన జర్నలిస్ట్ పై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. ప్రైవేట్ వ్యక్తులు రెవెన్యూ కార్యాలయంలో ఎలా స్కాన్ చేస్తారని ప్రశ్నించారు. ఆ సమయంలో తహశీల్దార్ లేకున్నా తాను అక్కడే ఉన్నానని చెబుతూ తన విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. జిల్లా కలెక్టర్ ఈ విషయం పై బహిరంగంగా విచారణ చేయాలని కోరారు. అక్రమ కేసును వెంటనే తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి పిల్లలమర్రి శ్రీనివాస్ జానీ పాషా, దినం కొండ శేషం రాజు, నాగుల్ మీరా, పాలేల్లి నరేష్, ఏరా బోలు వెంకట్ రెడ్డి, రమేష్, తండు వెంకన్న, తండు నరేష్, లక్ష్మణ్, దొంతగాని రమేష్, రుద్ర పంగు శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.