చెరువుగట్టు హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే..?

ప్రముఖ క్షేత్రం చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో

Update: 2025-03-25 11:43 GMT
చెరువుగట్టు హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే..?
  • whatsapp icon

దిశ,నార్కట్ పల్లి : ప్రముఖ క్షేత్రం చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో 41 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం ఉదయం లెక్కించారు. ఇందులో గట్టు పైన ప్రధాన హుండీలో రూ.28,26,120 రాగా, గట్టు కింద అమ్మవారి ఆలయంలో రూ. 4,02,640 లు వచ్చాయి. మొత్తంగా రూ.32,28, 760 లు వచ్చినట్లు ఆలయ ఈవో నవీన్ కుమార్ తెలిపారు. అదేవిధంగా అన్నదాన సత్రం లో హుండీలను లెక్కించారు. ఇందులోరూ. 1,15, 730 లు వచ్చాయి. ఈ కార్యక్రమంలో పరిశీలకులు ఏడుకొండలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


Similar News