పదో తరగతి పరీక్ష పత్రం లీకేజీకి రాజకీయ రంగు..
ఈనెల 21వ తేదీన పదో తరగతి పరీక్ష పత్రం లీకేజీ ఘటన అందరికీ

దిశ,నకిరేకల్ : ఈనెల 21వ తేదీన పదో తరగతి పరీక్ష పత్రం లీకేజీ ఘటన అందరికీ తెలిసిన విషయమే. లీకేజీ జరిగిన నాటి నుంచి ఈ విషయం రోజుకో తీరుగా మలుపు జరుగుతుంది. తాజాగా లీకేజీకి రాజకీయ రంగు పులుముకుంది. ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు పరీక్షా పత్రం లీకేజీ చేశారని సోషల్ మీడియాతో పాటుగా, డిజిటల్ పత్రికలో ప్రచురితమైనది. దీంతో తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. లీకేజీ జరిగిన నాటి నుంచే పోలీసులు అధికారులు చాకచక్యంగా నిందితులను గుర్తించారు. నిందితుల్లో ఐదుగురిని ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. ఈ రిమాండ్ చేసి అరెస్టు చేసిన వారిలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్ డ్రైవర్, ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరుడికి సంబంధించిన వారిగా ఉన్నారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ తో పాటుగా మరూరు మాజీ సర్పంచ్ నరేందర్, ఉగ్గిడి శ్రీనివాస్ యాదవ్ తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలేది లేదని న్యాయపరంగా పోరాడుతామని మీడియా ముందు మాట్లాడారు. అదేవిధంగా కోర్టుకు వెళ్లి పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు. ఇలా రోజుకో మలుపు తిరుగుతున్న పదో తరగతి పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో అనే విషయం నియోజకవర్గంలో హార్ట్ టాపిక్ గా మరిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా రాజకీయం వైపుగా ఈ వ్యవహారం తిరగడంతో అంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కావాలనే చేస్తున్నారని వీరేశం వర్గీయులు ఆరోపిస్తుంటే లేదు విద్యార్థుల భవిష్యత్తుని పాడు చేసేందుకే ఇలాంటి వ్యవహారాలు చేశారని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగిస్తారా మరి ఏమైనా జరుగుతుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే....
ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు..: ఉగ్గిడి శ్రీనివాస్ యాదవ్
పదో తరగతి పరీక్ష పత్రం లీకేజీలో కొన్ని డిజిటల్ పత్రికలు టీవీ ఛానళ్లు తమ ప్రమేయం ఉందని తప్పుడు వార్తలను అందించారు. ఈ తప్పుడు వార్తలను టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ అన్ని గ్రూపుల్లో వేసి అనవసరంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. నాపై తప్పుడు వార్తలు రాసి ఆరోపణలు చేసిన వారిని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాకు ప్రమేయం ఉందని చెప్పిన వ్యక్తితో నాకు ఎటువంటి పరిచయం కూడా లేదని తెలిపారు. న్యాయం జరిగే వరకు పోరాడుతానని పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు.