ఉద్యోగం ఇప్పిస్తానని రూ.14 లక్షల పైగా మోసం...
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 14 లక్షల 50 వేలు మోసం చేశాడని

దిశ, కోదాడ : ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 14 లక్షల 50 వేలు మోసం చేశాడని ఓ బాధితుడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కోదాడ పట్టణం, భవాని నగర్ కు చెందిన వ్యక్తి కి కొమరబండ గ్రామానికి చెందిన దాసరి జయసూర్య అనే అతడు 2022 లో పరిచయం అయ్యాడు. తనకు విద్యుత్ శాఖలో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పెద్ద పెద్ద ఆఫీసర్స్ పరిచయం ఉన్నారని, నీకు ఏదో ఒక డిపార్ట్మెంట్ లో పర్మినెంట్ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి పలు వాయిదాలలో రూ.14,50,000/-తీసుకున్నాడని బాధితుడి ఆరోపించాడు. డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేసాడు అని భాదితుడు ఫిర్యాదు ఇవ్వగా కోదాడ టౌన్ సీఐ శివ శంకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.