ట్రైన్ నుంచి విసిరిన బ్యాగ్.. అందులో ఏముందో తెలిస్తే షాకవ్వాల్సిందే?

మత్తు పదార్థాల్లో ఒకటైన గంజాయి అక్రమ రవాణా సరాసరి ట్రైన్‌లలో తరలిస్తున్నారు.

Update: 2025-03-22 10:31 GMT
ట్రైన్ నుంచి విసిరిన బ్యాగ్.. అందులో ఏముందో తెలిస్తే షాకవ్వాల్సిందే?
  • whatsapp icon

దిశ, డైనమిక్ సూళ్లూరుపేట: మత్తు పదార్థాల్లో ఒకటైన గంజాయి అక్రమ రవాణా సరాసరి ట్రైన్‌లలో తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రైన్ నుంచి బయటపడ్డ బ్యాగులో ఉన్న గంజాయి నిదర్శనంగా చెప్పవచ్చు. శుక్రవారం చెన్నై మెమో ఇంజన్ సాంకేతిక లోపంతో కలగుంట బ్రిడ్జి వద్ద ఆగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో వెనుక వస్తున్న అదే లైన్‌లో కామాక్షయ- యశ్వంత్ పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను దొరవారి సత్రం రైల్వేస్టేషన్ లో కొన్ని గంటలు నిలిపివేశారు. దీంతో ట్రైన్‌లో గంజాయి తరలిస్తున్న అక్రమ రవాణాదారుడు నాలుగు కిలోల ఉన్న గంజాయి బ్యాగ్ ని ప్లాట్ ఫామ్ పైకి విసిరి వేశారు.

అందరూ దీన్ని చూసి ఏముందోనని చర్చించుచుండగా డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్ సుళ్లూరుపేట జి ఆర్ పి ఎస్ ఐ చెన్న కేశవ్ కి సమాచారం అందించడంతో వారు బ్యాగ్ ని తీసుకువెళ్లి పరిశీలించారు. అందులో నాలుగు కిలోల పార్శల్ చేసిన గంజాయిని గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ సంఘటన వెలుగు చూడడంతో చెన్నై వైపు నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ గంజాయి వ్యాపారస్తులు బస్సుల్లో ప్రయాణించడం వదిలి, గుట్టు చప్పుడు కాకుండా రవాణా సాగిస్తున్నట్లు నిదర్శనం గా ఉంది. సెబ్ శాఖ అధికారులతో పాటు, జి ఆర్ పి పోలీసులు కూడా తనిఖీలు చేపట్టి గంజాయి అక్రమ రవాణాను అరికట్టాల్సి ఉందని ప్రయాణికులు కోరుతున్నారు.


Similar News