కడప మేయర్‌పై విజిలెన్స్ విచారణ పూర్తి.. నోటీసు ఇచ్చిన ప్రభుత్వం

కడప మేయర్, వైసీపీ నేత సురేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది..

Update: 2025-03-24 14:37 GMT
కడప మేయర్‌పై విజిలెన్స్ విచారణ పూర్తి.. నోటీసు ఇచ్చిన ప్రభుత్వం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: కడప మేయర్, వైసీపీ నేత సురేష్ బాబు(Kadapa Mayor and YSRCP leader Suresh Babu)కు బిగ్ షాక్ తగిలింది. ఆయనను పదవి నుంచి తొలగించేందుకు ప్రభుత్వం(Government) సిద్ధమైంది. సురేష్‌పై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ(Vigilance investigation) పూర్తి అయింది. దీంతో ఆయనకు షోకాజ్ నోటీస్(Show Cause Notice) జారీ చేసింది. పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో15 రోజుల్లో జవాబు ఇవ్వాలని పేర్కొంది.

కాగా కడపలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 49 డివిజన్లను సొంతం చేసుకుంది. దీంతో సురేష్ బాబును మేయర్‌గా ఎన్నుకున్నారు. అయితే కడప కార్పొరేషన్‌(Kadapa Corporation)లో పలు కాంట్రాక్టులను కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కడప ఎమ్మెల్యేగా టీడీపీ మహిళ నాయకురాలు మాధవి రెడ్డి(Tdp Mla Madhavi Reddy) గెలుపోందారు. దీంతో సురేష్ బాబు అవినీతిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కాంట్రాక్టుల విషయంలో వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఈ విచారణ పూర్తి కావడంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు నోటీసులు జారీ చేసింది. 

Tags:    

Similar News