ముస్లిం మైనార్టీలకు గుడ్ న్యూస్... ఇఫ్తార్ విందులో చంద్రబాబు కీలక ప్రకటన

ముస్లిం మైనార్టీలకు ఇఫ్తార్ విందులో చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు..

Update: 2025-03-27 14:01 GMT
ముస్లిం మైనార్టీలకు గుడ్ న్యూస్... ఇఫ్తార్ విందులో చంద్రబాబు కీలక ప్రకటన
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ముస్లిం మైనార్టీల(Muslim minorities)కు సీఎం చంద్రబాబు(CM Chandrababu) గుడ్ న్యూస్ తెలిపారు. ముస్లిం పేదలను ఆర్థికంగా పైకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో చేపట్టిన ఇప్తార్ వింధులో చంద్రబాబు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి దువా ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ముస్లింలు ‘జకాత్’(Zakat)కార్యక్రమంలో పేదలకు సాయం చేస్తారని తెలిపారు. పేదలకు ఆర్థిక సాయం చేసే గుణమున్న కమ్యూనిటీ ముస్లిం సోదరులదని చెప్పారు. ప్రవిత్రమైన రంజాన్ మాసంలో తాను పీ4 కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

డబ్బులున్న వాళ్లు పేదలకు సాయం చేసేలా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దబోతున్నట్లు m తెలిపారు. సాయం చేసిన వారిని మార్గదర్శిగా, సాయం పొందిన ఫ్యామిలీని బంగారు కుటుంబంగా పిలుస్తామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లు, టెలీకమ్యూనికేషన్, పవర్ ప్రాజెక్టులు వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ఇంకా పేదలున్నారని, మూడు పూటలు తిండిలేని పరిస్థితి ఉందన్నారు. పేద వాళ్లతో ఉండాలని జీవిత ఆశయంగా పెట్టుకున్నానని తెలిపారు. నూటికి నూరు శాతం పీ4 కార్యక్రమంతో పేదలను పైకి తీసుకొస్తామని దీమా వ్యక్తం చేశారు. ఈ నెల 30న పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. పీ4 కార్యక్రమం ద్వారా పేద ముస్లింలను అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. అన్ని విషయాల్లో తాను కూడా కలిసి వస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Tags:    

Similar News