నడిరోడ్డుపై సైకో వీరంగం.. భయంతో పరుగులు తీసిన జనం
నడిరోడ్డు మీద ఓ సైకో హల్ చల్ చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: నడిరోడ్డు మీద ఓ సైకో హల్ చల్ (Psychotic rampage) చేసిన ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలో చోటు చేసుకుంది. సాధారణంగా మతి స్థిమితం లేని వ్యక్తులు చిన్న పిల్లలతో సమానం అని అంటుంటారు. కానీ వారికి కోపం వస్తే మాత్రం వీరంగం సృష్టిస్తారు. ఎవరు ఉన్నారు.. ఏం చేస్తున్నాం అనేది తెలియకుండా ప్రవర్తిస్తారు. ఈ క్రమంలోనే పోచారం మున్సిపాలిటీ (Pocharam Municipality) పరిధిలో ఓ సైకో నడి రోడ్డుపై హంగామా సృష్టించాడు. నేషనల్ హైవే (National High Way)పై రాళ్ల దాడి (Stone Pelting) చేస్తూ.. జనాన్ని పరుగులు పెట్టించాడు. పోచారం పరిసరాల్లో తిరుగుతూ ఉండే ఓ మితిస్థిమితం లేని వ్యక్తి ఉన్నట్టుండి ఒక్కసారిగా వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.
రాళ్లు పట్టుకొని పరుగులు తీస్తూ.. రోడ్డ మీద వెళుతున్న వాహనదారులపై దాడి చేయడం ప్రారంభించాడు. కార్లు, బైకులపై రాళ్లు పట్టుకొని విసిరాడు. అంతేగాక రోడ్డు గుండా వెళుతున్న బాటసారులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అతనికి అడ్డొచ్చిన వారిపై కత్తితో దాడి చేసేందుకు సైతం వెనకాడలేదు. దీంతో సైకో ప్రవర్తన చూసిన జనం పరుగులు తీయడం ప్రారంభించారు. ఇందులో కొందరు యువకులు ధైర్యం చేసి ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వాళ్లపై కూడా రాళ్లతో దాడికి యత్నించాడు. యువకులు ఎట్టకేలకు తెగించి ఆ సైకోను పట్టుకొని, తాళ్లతో కట్టేశారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సైకోను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.