జపాన్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెలలో జపాన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వచ్చే నెలలో జపాన్ పర్యటనకు (trip to Japan) వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు అధికారులు సీఎం పర్యటన (CM's visit)కు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. ఏప్రిల్ నెల (April month)లో వారం రోజుల పాటు సీఎం జపాన్ లోనే పర్యటించనున్నారు. సీఎం తన పర్యటనలో భాగంగా ఒసాకాలో జరగనున్న ఇండస్ట్రియల్ ఎక్స్‌పో (Industrial Expo)లో పాల్గొననున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై వివిధ కంపెనీలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. ఈ జపాన్ పర్యటనకు సీఎంతో పాటు ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర అధికారులు వెళ్లనున్నారు. కాగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణతో పాటు, ప్రభుత్వ పనితీరు, పథకాల అమలు, బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చిస్తున్నారు.