ఎమ్ఎమ్‌టీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం కేసులో పురోగతి.. నిందితుడు గుర్తింపు

ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో ఎమ్ఎమ్‌టీఎస్ రైలులో యువతిపై జరిగిన అత్యాచారయత్నం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

Update: 2025-03-25 05:09 GMT
ఎమ్ఎమ్‌టీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం కేసులో పురోగతి.. నిందితుడు గుర్తింపు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో ఎమ్ఎమ్‌టీఎస్ రైలు (MMTS train)లో యువతిపై జరిగిన అత్యాచారయత్నం (rape attempt) సంచలనంగా మారిన విషయం తెలిసిందే. లోకల్ రైలులో ఒంటరిగా ఉన్న యువతి పై దుండగులు అత్యాచారం యత్నం చేయగా.. భయంతో యువతి రన్నింగ్ రైలు నుంచి కిందకు దూకేసింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా.. యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అలాగే ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని రైల్వే స్టేషన్ లలో ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేశారు. సీసీటీవీలో రికార్డు అయిన ఫోటోలను యువతికి చూపించగా.. నిందితుడిని బాధితురాలు గుర్తుపట్టింది. అనంతరం వివరాలు సేకరించిన పోలీసులు (police) యువతి పై దాడికి యత్నించిన వ్యక్తి జంగం మహేష్‌గా గుర్తించారు. నింధితుడు గత కొంత కాలంగా గంజాయికి బానిస గా మారి.. ఇంటికి దూరంగా ఉంటున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు.

Similar News