వైరా రిజర్వాయర్ లో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి..

ఈత రాకపోయినప్పటికీ స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన విద్యార్థి శవంగా మారిన సంఘటన వైరా మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2025-03-22 11:06 GMT
వైరా రిజర్వాయర్ లో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి..
  • whatsapp icon

దిశ, వైరా : ఈత రాకపోయినప్పటికీ స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన విద్యార్థి శవంగా మారిన సంఘటన వైరా మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వైరా మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీకి చెందిన బెజ్జం రాబిన్ (9) అనే విద్యార్థి మధ్యాహ్నం ఒంటి పూట బడుల అనంతరం సరదాగా స్నేహితులతో ఈతకు వెళ్లాడు. తనకు ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోగా స్థానికులు గమనించి ఒడ్డుకు చేర్చి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తండ్రి బాలస్వామి వైరా మున్సిపాలిటీలో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. తల్లి మేరీ కూలి పనులు కు వెళ్లగా ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో వారి రోదనలు మిన్నంటాయి.


Similar News