పేదల సొంతింటి కల ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం: ఎమ్మెల్యే
ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల సొంతింటి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు.

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల సొంతింటి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. జాజిరెడ్డిగూడెం మండలం ఉయ్యాలవాడ గ్రామంలో జంగాలు, దళితులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు పోసి, భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. గత పదేళ్ల కాలంలో పేదలకు ఒక్క ఇళ్లును మంజూరు చేయకుండా పేదలకు అన్యాయం చేశారని ఆరోపించారు. పదేళ్ల పాటు కమీషన్లు ఇచ్చే పనులను చేసి, రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్ ఎల్సోజు చామంతి నరేష్, మండల,గ్రామ ప్రత్యేక అధికారులు శశిధర్ రెడ్డి,బాలు నాయక్, పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి, ఎంపీడీవో గోపి,ఏఓ గణేష్, ఏఈ వెంకన్న, నాయకులు కొరపిడత అవిలయ్య,ఇందుర్తి వెంకటరెడ్డి, గుడిపల్లి మధుకర్ రెడ్డి,బీరవోలు విక్రమ్ రెడ్డి,దలవాయి శ్రీధర్,పాశం భాస్కర్ రెడ్డి, పిట్టల రాంబాబు, మార్కెట్ డైరెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజలు పాల్గొన్నారు.