ఆశవర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

ఆశావర్కర్ల న్యాయమైన సమస్యలు అన్నింటినీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా నాయకులు రొండి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

Update: 2025-03-21 12:03 GMT
ఆశవర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
  • whatsapp icon

దిశ, వేములపల్లి : ఆశావర్కర్ల న్యాయమైన సమస్యలు అన్నింటినీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా నాయకులు రొండి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో వేములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశావర్కర్ల తో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం ఆసుపత్రి డాక్టర్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశావర్కర్ల కు 26000 రూ.ల కనీస వేతనం ఇవ్వడంతోపాటు పీఎఫ్ , ఈఎస్ఐ తో పాటుగా ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పెండింగ్ లో ఉన్న పల్స్ పోలియో లెప్రసీ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. సంవత్సరానికి 2 జతల యూనిఫాం ఉచితంగా అందజేయాలని కోరారు. టీబీ టెస్టులకు సెపరేట్ గా వర్కర్ ను నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశావర్కర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ కోడిరెక్క వెంకన్న, నాయకులు వడ్డగాని సైదులు, అయితగాని విష్ణు, ఆశావర్కర్లు రాధిక, లక్ష్మీ, రజిత, సుజాత, నాగమ్మ, నాగమణి, జయమ్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.


Similar News