KomatiReddy VenkataReddy : ఆయనకు ఓనమాలు కూడా తెలియవు : కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (KomatiReddy VenkatarReddy) పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-03-20 14:24 GMT
KomatiReddy VenkataReddy : ఆయనకు ఓనమాలు కూడా తెలియవు : కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (KomatiReddy VenkatarReddy) పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ తన ముందు బచ్చ అని, రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్(KCR) కొడుకు అనే అర్హత తప్పా కేటీఆర్ కు ఏ అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తండ్రి చాటు కొడుకు అనే విషయం మర్చిపోవద్దని అన్నారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రైతు బిడ్డగా.. ఒక సాధారణ కార్యకర్తగా పార్టీలోకి వచ్చి, అంచెలంచెలుగా ఎదిగి నేడు ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. కేటీఆర్ కు రేవంత్ తో పోలిక కూడా కష్టం అన్నారు.

రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దేశం కోసం తమ కుటుంబాన్ని సర్వస్వం కోల్పోయారని.. వారి పేరు ఎత్తే అర్హత కూడా కేటీఆర్ కు లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. కాగా నేడు కేటీఆర్ సూర్యాపేట(Suryapeta)లో పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల(BRS Silver Jubli Celebrations) ఏర్పాట్లపై పార్టీ నేతలు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. రేవంత్ రెడ్డి ఓ జాక్ పాట్ సీఎం అని, ఢిల్లీకి మూటలు మోసి, పదవులు కాపాడుకోవడమే ఆయన పని అని విమర్శించారు.

Tags:    

Similar News